గేమ్ చేంజర్ అప్డేట్ తో ఇక ఫ్యాన్స్ కి పునకాలే..!

frame గేమ్ చేంజర్ అప్డేట్ తో ఇక ఫ్యాన్స్ కి పునకాలే..!

murali krishna
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ఫ్యాన్స్ అంతే నిరుత్సాహంలో కూడా ఉన్నారు ఈ సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఎలాంటి అప్డేట్స్ లేవని ఇన్ని రోజులు ఎదురుచూసారు. రోజులు కాదు, నెలలు కాదు, ఏండ్లకేండ్లు వెయిట్ చేయడమంటే.. స్టార్ హీరోల అభిమానులకు కాస్త కష్టమే.అందులో మెగా ఫ్యాన్స్ అంటే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. పైగా శంకర్‌తో సినిమా అనగానే గాల్లో ఎగిరిగంతేశారు మెగాభిమానులు. అలాంటి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం.. వాళ్లకు నిజంగానే చిర్రెత్తెలా చేసింది. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాని డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తారని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ఇన్ని రోజులు షూటింగ్ కూడా అవ్వలేదని బాధపడగా ఇటీవలే గేమ్ ఛేంజర్ షూట్ పూర్తయిందని సమాచారం. తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.రీసెంట్‌గా వస్తున్న సమాచారాన్ని బట్టి వినాయక చవితి పండగ రోజున మూవీ నుంచి సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ "గేమ్ చేంజర్ ఫైర్" అంటూ చేసిన పోస్ట్ కు ఎస్ వి సి రిప్లై ఇచ్చింది. అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న రాంచరణ్ అభిమానులు మేకర్స్ పై సీరియస్ గా ఉండగా ఈ వార్త వారిలో సంతోషాన్ని నింపుతుందనే చెప్పాలి.ఇదిలావుండగా నిర్మాత దిల్రాజు ఇదివరకే చెప్పినట్లుగా కచ్చితంగా క్రిస్మస్ సందర్భంగానే ఉంటుందని మరో వార్త చక్కర్లు కొడుతుంది. అంటే 2024 డిసెంబర్ 20వ తేదీని లాక్ చేసి పెట్టారట ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇక సెప్టెంబర్ చివరి వారంలో టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఒకటైనా దసరాకు రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలావుండగా ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. ఇక చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: