సుకుమార్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహేష్..?

frame సుకుమార్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహేష్..?

Suma Kallamadi
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ త్వరలోనే ప్రారంభం కానుంది. దీన్ని మూడేళ్లు పాటు తీయనున్నారు. ఇది ఎన్ని పార్ట్స్ లో వస్తుందనేది తెలియ రాలేదు. దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1,500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని బ్యాంకు రోల్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మహేష్ బాబు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయిపోవాల్సి ఉంది. కానీ ఆయన పాన్ ఇండియా హిట్ సినిమాలను రిజెక్ట్ చేసేసి దెబ్బయిపోయారు. మొన్నీమధ్య కూడా సుకుమార్ పుష్ప సినిమాలో హీరో ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ డీగ్లామర్ రోల్‌లో సెట్ కానని, అభిమానులు కూడా చూడలేరని మహేష్ దీన్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడట.
అదే సమయంలో ఈ హ్యాండ్సమ్ హీరో మహర్షి సినిమా చేశాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాబు మాట్లాడుతూ దర్శకుడు పైడిపల్లి వంశీ తనకోసం టూ ఇయర్స్ వెయిట్ చేశాడని, అందుకే ఆయనతో మూవీ చేయడానికి ఒప్పుకున్నానని తెలిపాడు. అయితే పూరీ జగన్నాథ్, సుకుమార్ గురించి మహేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం బాధాకరమని, వారిని ఇన్ డైరెక్ట్ టార్గెట్ చేశారని చాలా మంది కామెంట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో వంశీ వెయిటింగ్ గురించి చెప్పాలన్నదే నా ఉద్దేశం అదే చెప్పాను, వేరే వారిని, ముఖ్యంగా సుకుమార్ ను పాయింట్ చేయాలని కాదు అని చెప్పారు.
ఈ రోజుల్లో డైరెక్టర్లు హీరో డేట్స్ కోసం కనీసం 2 నెలలు కూడా వెయిట్ చేయలేకపోతున్నారని, అంత ఓర్పు కూడా వారికి లేకపోవడం బాధాకరమని ఓ సందర్భంలో మహేష్ బాబు కామెంట్స్ చేశారు. పుష్ప మూవీ స్టోరీ వినిపించిన సమయంలో మహేష్ మూవీతో బిజీగా ఉన్నారన్న విషయం వాస్తవం. ఇది పూర్తయిన తర్వాత పుష్ప సినిమా చేద్దామని ఆయన సుకుమార్ తో అన్నాడనేది రూమర్. అంతేకాదు సుకుమార్ మహేష్ వెయిట్ చేయమన్నా వెయిట్ చేయకుండా అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీసేసారని మహేష్ బాగా కోపంగా ఉన్నాడన్నట్టు కూడా ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాన్ని మహేష్ స్పందించాడు. సుకుమార్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. అతి త్వరలోనే తాము మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తామని కూడా స్పష్టం చేశారు. ఆయన, నేను కలిసి చేసిన నేనొక్కడే సినిమా ఒక కల్ట్‌ క్లాసిక్ మూవీ అయిపోయిందని కూడా తెలిపాడు. అందుకే సుకుమార్ కి థాంక్స్ చెబుతున్నానని అన్నారు. మహేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: