N కన్వెన్షన్ కూల్చివేతపై.. స్పందించిన పవన్.. నాగార్జున పై సెటైర్?

praveen
చెరువులను కుంటలకు సంబంధించిన భూములను కబ్జా చేసి భవనాలు ఫంక్షన్ హాల్ళ్లను నిర్మించిన వారికి షాక్ ఇస్తూ హైడ్రా అధికారులు ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారూ. అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖులకు సంబంధించిన భవనాలను సైతం వదలడం లేదు. ఇటీవల స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా కూల్చివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్లోని మాదాపూర్ లో ఉన్న ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చి వేయడం సంచలనంగా మారింది.

 అయితే ఇది చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణమే కావడం గమనర్హం. కాగా గత ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాగార్జునకు సంబంధించిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసింది. అయితే కేవలం ఈ ఒక్క కట్టడం మాత్రమే కాదు హైదరాబాదులో ఇలా చెరువులను ఆక్రమించి కట్టిన భవనాలు అన్నింటిని కూడా కూల్చేసుకుంటూ ఎంతో దూకుడుగా ముందుకు సాగుతుంది హైడ్రా. కాగా ఇలా హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్న విషయంపై ఎంతో మంది ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇదే విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ రేవంత్ సర్కార్ ను అభినందించాడు

 ఇక ఎప్పుడూ పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో  స్పందించాడు. వరద బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని తెలిపేందుకు ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఈ ప్రెస్ మీట్ లో అనేక అంశాలపై చర్చించాడు అయితే ఇంత భారీ స్థాయిలో వరదలు రావడానికి ప్రధాన కారణం చెరువులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు నిర్మించడమే అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థ ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. మీరు కూడా అలాంటి చర్యలు చేపట్టబోతున్నారా అని అడగగా.. హైడ్రా వ్యవస్థ అక్రమ కట్టడాలను కూల్చివేయడం మంచి పరిణామమే.కానీ దీనిని మేము ఇక్కడ అమలు చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది అమాయకులు తెలియకుండా స్థలాలను కొనేసి ఉంటారు. వాళ్ళు సామాన్యులు అలాంటి వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలి. ఆ విధంగా మేము ప్రయత్నాలు భవిష్యత్తులో చేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా పవన్ కళ్యాణ్ హైడ్రాకి మద్దతు తెలపడంతో అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అయ్యారు అని చెప్పాలి. ఒక రకంగా నాగార్జున అక్రమ కట్టడం కూల్చివేయడం మంచి పరిణామమే  అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: