ప్రీమియర్లతో.. లాభాలు కాదు నష్టాలే ఎక్కువ.. షాకింగ్ విషయం చెప్పిన దిల్ రాజు?
ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి అంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలను విడుదల చేయడం విషయంలో కూడా ప్రొడ్యూసర్లు సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు ఇక సాధారణంగా ఉండే రోజు వారి నాలుగు షోలు మాత్రమే వేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఏకంగా అభిమానుల కోరిక మేరకు ప్రీమియర్ షోలు వేయడం చూస్తూ ఉన్నాం. స్టార్ హీరో సినిమా ఏది రిలీజ్ అయిన కూడా ఇలాంటి ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇంకొన్ని సినిమాలకు అయితే ఏకంగా సినిమా విడుదలకు ఒక రోజు ముందే ఇలాంటి ప్రీమియర్ షోలు చేయడం జరుగుతోంది. అయితే ఇలాంటి ప్రీమియర్ షోల కారణంగా ప్రొడ్యూసర్లకు భారీగా లాభాలు వస్తూ ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు.
కానీ సినిమా రిలీజ్ డేట్ కి ఒక్కరోజు ముందు వేసే పెయిడ్ ప్రీమియర్లతో లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ప్రీమియర్లు వేయడం అనేది ప్రమోషనల్ స్ట్రాటజీ. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచిదే. కానీ నెగటివ్ టాక్ వచ్చిందంటే.. చాలు తర్వాత రోజే థియేటర్లకు ఎవ్వరూ రారు అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అదే సమయంలో కంటెంట్ బాగుంటే మాత్రమే ప్రీమియర్ షోలు ఎన్నో చిన్న సినిమాలకు హెల్ప్ అవుతాయని.. థియేటర్లను ప్రేక్షకులకు రప్పించడంలో ఉపయోగపడతాయి అంటూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశాడు.