బొంబాయి మూవీ హీరోలో ఛాన్స్ వదులుకొని 2 నెలలు ఏడ్చిన స్టార్ హీరో..?

Pandrala Sravanthi
మణిరత్నం దర్శకత్వలో వచ్చిన అద్భుతమైన ప్రేమ కావ్యం బొంబాయి.. అరవింద్ స్వామి, మనిషా కొయిరాలా హీరో హీరోయిన్ గా చేసిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఎంతో మంది మన్ననలు అందుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక చాలామంది నుండి నెగెటివిటీ కూడా వచ్చింది.కానీ ఆ నెగెటివిటీని పట్టించుకోకుండా చాలా మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి బ్లాక్ బస్టర్  అయ్యేలా చేశారు. ఇక ఈ అద్భుతమైన ప్రేమకావ్యం లో ముస్లిం, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ ఉంటుంది. మత కలహాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి ఈ బొంబాయి మూవీలో అరవింద స్వామి కంటే ముందు హీరో పాత్రలో మరో నటుడిని అనుకున్నారట. కానీ ఆయన చేసిన చిన్న తప్పు కారణంగా ఆ సినిమా నుండి ఆయన తప్పుకోవలసి వచ్చిందట. 

ఇక ఆ హీరో ఎవరో కాదు ప్రస్తుతం తంగళాన్  మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొలీవుడ్ హీరో విక్రమ్.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి సినిమాలో హీరోగా మొదట అవకాశం విక్రమ్ కే వచ్చిందట. అయితే సినిమా ఫైనల్ ఆడిషన్ కి విక్రమ్ వెళ్లారట.కానీ ఆ ఆడిషన్ కి వీడియో కెమెరా కాకుండా స్టిల్ కెమెరానికి తీసుకురావడంతో ఇదేంటి ఈ కెమెరా తీసుకువచ్చారు అని నటించమంటే నేనెందుకు నటించాలి అని అనుకున్నాను. ఆ తర్వాత స్టిల్ కెమెరా కావడంతో నేను కాస్త కదిలితే ఫోటో బ్లర్ గా వస్తుంది అని భావించి సైలెంట్ గా అలాగే ఉండిపోయాను.

దాంతో నాకు వచ్చిన అవకాశం నా చేతులారా నేనే చేజార్చుకున్నాను.. దాంతో ఈ సినిమాలో హీరో అవకాశం మిస్ చేసుకోవడంతో నేను దాదాపు రెండు నెలలపాటు ఏడ్చాను. ఈ సినిమా ఛాన్స్ మిస్ అయ్యాక దాదాపు రెండు నెలల పాటు ఉదయం లేవడంతోనే ఏడ్పు మొహంతో లేచి చాలా సేపు ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఇలా రెండు నెలల పాటు జరిగింది అంటూ విక్రమ్ మొదటిసారి బొంబాయి సినిమా గురించి నోరు విప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: