జనసేనాని : పవన్ కళ్యాణ్ హీరో అయింది సినిమాలతో కాదు.. వ్యక్తిత్వంతో?
అయితే పవన్ కళ్యాణ్ ను విమర్శించే ప్రత్యర్ధులు అందరూ కూడా ఆయనని సినిమా హీరో అని అంటూ ఉంటారు. నిజమే ఆయన సినిమాలతోనే ఫేమస్ అయ్యారు. సినిమాలతోనే అందరికీ తెలిసారు. కానీ సినిమాలతో హీరో అవ్వలేదు. ఎందుకంటే మిగతా హీరోలతో పోల్చి చూస్తే ఆయన క్రేజ్ ఒక లెవెల్ లో ఉంటుంది. కానీ అది కేవలం సినిమాలతో వచ్చింది కాదు. మిగతా హీరోలతో పోలిస్తే ఆయన చేసింది తక్కువ సినిమాలే. అందులో హిట్ సినిమాలు కూడా కొన్నే. ఇలాంటి కెరియర్ ఎవరికీ ఉన్న అంత క్రేజ్ వచ్చేది కాదేమో. కానీ పవన్ కళ్యాణ్ మిగతా హీరోలను దాటి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. దీనికి కారణం ఆయన సినిమాలు మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం కారణం.
ఎంత పెద్ద హీరో అయినా సామాన్య జీవితాన్ని గడిపే ఆయన స్వభావం.. ఎవరికైనా సమస్య వచ్చిందంటే సొంత వారికే కష్టం వచ్చిందేమో అన్నట్లుగా తల్లడిల్లిపోయే మంచి హృదయం.. అన్యాయం జరిగిందంటే చాలు బాధితుల పక్షాన నిలబడి ఎంతటి వారినైనా ఎదిరించే తత్వమే ఆయనను హీరోని చేసింది. రాజకీయాల్లోనూ ఇదే ఆయనను ప్రజలకు దగ్గర చేసింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఆయన ఓడిపోయారు. ప్రజలు అస్సలు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ని నమ్మలేదు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా తాను మాత్రం ప్రజలకు మంచి చేయడానికి వచ్చిన నాయకుడిని అని మాటలతో చెప్పడం కాదు చేతులతోనే చేసి చూపించారు.