ఏ కాస్త సందు దొరికిన దూరిపోవడానికి రెడీగా ఉన్నా ఆ ఇద్దరు యువ హీరోలు..?

Pulgam Srinivas
ఈ మధ్యకాలంలో కాస్త క్రేజ్ ఉన్న సినిమాల పరిస్థితి చాలా కఠినంగా ఉంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో సినిమాలు పూర్తి అయినా కూడా విడుదల చేయలేని పరిస్థితి. దానికి ప్రధాన కారణం మరి కొంత కాలం లోనే దేవర సినిమా విడుదల కానుంది. దేవర సినిమాకు హిట్ టాక్ వస్తే కనీసంలో కనీసం ఆ మూవీ రెండు వారాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర హల్చల్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఆ తర్వాత దసరా సీజన్ మొదలు కానుంది. ఈ సీజన్ కి ఇప్పటికే అనేక సినిమాలు విడుదల కు రెడీగా ఉన్నాయి. విడుదల తేదీలను కూడా ప్రకటించాయి.

అందులో ఏ సినిమా క్లిక్ అయినా కూడా రెండు వారాలు మళ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర వేరే సినిమాలకు ఛాన్స్ ఉండదు. అక్కడ ముగిసింది అంటే మళ్ళీ డిసెంబర్ నెలలో అనేక భారీ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత మరి కొంత కాలం లోనే సంక్రాంతి సీజన్ మొదలు కానుంది. సంక్రాంతి పండుగ కు అనేక సినిమాలు పోటీ పడడం జరుగుతుంది. ఇలా దాదాపు 3 నెలల పాటు చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉండడంతో కాస్త క్రేజ్ ఉన్న సినిమాల షూటింగ్లో పూర్తి అయినా కూడా ఏ తేదీల్లో విడుదల చేయాలో తెలియక మేకర్స్ సతమతం అవుతున్నారు.

ఇకపోతే నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరి కొంత కాలంలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ తో పాటు మ్యాడ్ 2 మూవీ కూడా షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు మూవీ బృందాలు కూడా ఏదైనా సినిమా పోస్ట్ పోన్ అయ్యి కాస్త గ్యాప్ దొరికితే ఆ తేదీల్లో ఈ మూవీలను దించడానికి మూవీ మేకర్స్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: