చిరు.. నాగ్.. వెంకీ ఈ ముగ్గురి సక్సెస్ ఫార్ములా ను అస్సలు ఫాలో కాని బాలయ్య..?

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్య కాలంలో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ల ప్రభావం విపరీతంగా పెరిగి పోవడంతో రీమిక్ సినిమాలో జోరు కాస్త తగ్గింది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం రీమిక్ సినిమాలో ట్రెండు జోరుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగింది. వేరే భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగు భాషలో రీమిక్ చేయడం , అలాంటి సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా రీమిక్ సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ కూడా అనేక విజయాలను అందుకున్నారు.


ఇక తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ మాత్రం తన కెరియర్లో ఇప్పటివరకు ఒక్క రీమిక్ సినిమాలో కూడా నటించలేదు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్ లో నటించిన ప్రతి సినిమా కూడా స్టేట్ సినిమా కావడం విశేషం. చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ ఓ వైపు పక్క భాషలో సూపర్ సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేసి ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకుంటున్న సమయంలో కూడా బాలకృష్ణ రీమిక్ సినిమాలకు జోలికి వెళ్లలేదు. కేవలం కొత్త కథలతో రూపొందిన సినిమాల లోనే నటిస్తూ వచ్చాడు. వాటితోనే అనేక విజయాలను అందుకున్నాడు.


అలా కొత్త కథలతో రూపొందిన సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదగడం మాత్రమే కాకుండా , ఇప్పటికీ కూడా సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో ఎన్ బి కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోయే అఖండ 2 సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: