అందం , అభినయం , నటన అన్ని ఉన్నా కూడా కొంతమంది హీరోయిన్లకు విజయాలు దక్కనట్లు అయితే క్రేజ్ దక్కదు. అలా అందం , అభినయం , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగులో మొదటగా నటించిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ప్రియాంక అరుణ్ మోహన్ కు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద స్థాయి దక్కలేదు. ఈమె నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఇక ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి అంచనాల నడమే థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో ఈమె తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె తమిళ్లో మాత్రం మంచి విజయాలను అందుకుంది. తమిళ్ లో ఈ బ్యూటీ వరుణ్ డాక్టర్ , కాలేజ్ డాన్ సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ఇక ఈ బ్యూటీ తాజాగా తెలుగులో సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆగస్టు 29 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది.
ప్రస్తుతం ఈ మూవీ కి కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇక చాలా కాలం నుండి తెలుగులో ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఇన్నాళ్లకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి విజయం దక్కింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తే ఈమె తెలుగు లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.