హేమ కమిటీ వల్ల.. మోహన్ లాల్ సంచలన నిర్ణయం..!
అయితే ఇప్పుడు తాజాగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి నటుడు మోహన్లాల్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా మలయాళ ఇండస్ట్రీలో ఈ విషయం సంచలనంగా మారింది.. ఈయనతో పాటు 17 మంది సభ్యులు కూడా ఈ పదవి నుంచి రాజీనామా చేశారు.ఈ విషయాన్ని అమ్మ సంఘం అధికారికంగా తెలియజేసింది. మలయాళ మూవీ అసోసియేషన్ లో ఉండేటువంటి కొంతమంది సభ్యుల పైన లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వినిపించడంతో అందులోని భాగంగానే నైతిక బాధ్యత వల్ల వీరందరూ కూడా రాజీనామా చేసినట్లుగా ఒక లెటర్ ద్వారా తెలియజేశారు. ఇలా మూకుమ్మడిగా రాజీనామా చేయడం వల్ల అమ్మ అసోసియేషన్ రద్దు చేసినట్లుగా తెలియజేశారు.
మరో రెండు నెలలలో కొత్త పాలక మండలి నిర్వహించబోతున్నామని అందులో ఎవరినైనా ఎన్నుకోవచ్చు అంటూ తెలియజేశారు. అమ్మ సంఘంలో మోహన్లాల్ అధ్యక్షత ఉండగా.. జగదీష్, సూరజ్ వెజ్జరాయుడు, జయన్ చేర్తలా, టావినో థామస్ తదితరులు ఉన్నారట అయితే జస్టిస్ హేమా కమిటీలో డైరెక్టర్ రంజిత్ పేరు నటుడు సిద్ధిఖి, ముఖేష్, బాబు రాజ్, జయసూర్య తదితర పేర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ హీటెక్కిస్తోంది. చాలామంది మహిళలను ఎన్నో రకాలుగా హింసించారని లైంగిక వేధింపులకు గురి చేశారని కూడా ఈ కమిటీ తెలియజేసింది.