ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ తో రూపొందిన స్టార్ హీరోల సినిమాల కంటే తక్కువ బడ్జెట్ తో రూపొందిన కొత్త దర్శకుల సినిమాలే ఎక్కువ ప్రభావితం చూపుతున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాభాలను నిర్మాతలకు తెచ్చిపెడుతున్నాయి. ఇకపోతే ఆగస్టు నెలలో కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాలకు దీటుగా నిలబడ్డాయి. అలాగే పెద్ద సినిమాలు నష్టాలను తెచ్చుకున్న చిన్న సినిమాలు మాత్రం అద్భుతమైన లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టాయి. ఈ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే ఒక చిన్న సినిమా థియేటర్ లలో విడుదల అయింది.
ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నిహారిక కు ఈ సినిమా ద్వారా మంచి లాభాలు కూడా వచ్చాయి. నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమాను నిర్మించినందుకు ఈమెకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆగస్టు 15 వ తేదీన భారీ సినిమాలతో పోటీగా ఆయ్ అనే ఒక చిన్న సినిమా థియేటర్ లలో విడుదల అయింది.
భారీ సినిమాలు పోటీగా ఉన్నా కూడా ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ఇప్పటికీ కూడా రాబడుతుంది. ఈ మూవీ కి అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించాడు. ఇలా దర్శకత్వం వహించిన మొదటి సినిమాలతోనే తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకులకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ఆఫర్ లు ప్రస్తుతం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా టాలెంట్ ఉన్న యువ దర్శకులకు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన అవకాశాలు దక్కుతున్నాయి.