కొన్ని సంవత్సరాల క్రితం డిమాంటి కాలనీ అనే పేరుతో తమిళ్ లో ఓ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను డిమోంటి కాలనీ అనే పేరుతో తెలుగు లో కూడా విడుదల చేశారు. ఇకపోతే తమిళ్ లో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా తెలుగు లో కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇలా డిమాండ్ కాలనీ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా డిమాంటి కాలనీ 2 అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ భాషలో విడుదల అయింది.
ఇకపోతే మొదట తమిళ భాషలో విడుదల అయిన ఈ సినిమా ఆ తర్వాత వారం రోజులకు తెలుగు లో కూడా విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు వస్తున్నాయి. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 70 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండవ రోజు ఈ మూవీ కి 40 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్ లు వచ్చినట్లు సమాచారం. ఇకపోతే రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 76 లక్షల రేంజ్ కి అటు ఇటుగా షేర్ కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తుంది.
అలాగే రెండు రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ డీసెంట్ విజయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అందుకోవాలి అంటే 3 కోట్ల స్థాయిలో షేర్ కలక్షన్ లను వసూలు చేయవలసి ఉంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో ... ఆ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.