హిట్ డైరెక్టర్‌తో రజనీకాంత్ కొత్త సినిమా
అయితే తాజాగా రజనీకాంత్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. దళపతి విజయ్‌తో 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మారి సెల్వరాజ్, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి కొత్త సినిమా చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ కాంబినేషన్ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెల్వరాజ్ ఇలా చెప్పుకొచ్చారు.....'రజనీకాంత్ గారికి నేను అంటే చాలా ఇష్టం. నేను డైరెక్ట్ చేసిన కర్ణన్, మామన్నన్ చిత్రాలను ఆయన చూసి అభినందించారు. ఆ సమయంలోనే ఒక సినిమా చేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం.
ఇప్పటికైతే కథ రెడీ అయింది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.' అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన అన్న మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా కథ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మారి సెల్వరాజ్ తన సినిమాల్లో సమాజంలోని వివిధ అంశాలను ప్రస్తావిస్తూ, కొత్త కథలను తెరకెక్కిస్తారనే విషయం తెలిసిందే. రజనీకాంత్‌తో కలిసి ఆయన ఎలాంటి కథను ఎంచుకున్నారనేది ఆసక్తికరంగా ఉంది. మారి సెల్వరాజ్ తన సినిమాల్లో కంటెంట్‌పై ఎక్కువ దృష్టి పెడతారు. రజనీకాంత్‌తో కలిసి ఆయన ఎలాంటి కంటెంట్‌ను తీసుకువస్తారనేది మీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ప్రస్తుతం రజనీకాంత్ పాన్ ఇండియా వంటి సినిమాలతో బిజీ గా ఉన్నారు.