ఆయుధ పూజ సాంగ్ పై కీలక అప్డేట్ ఇచ్చిన దేవర టీం..!

murali krishna
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవరపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడం.. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27 ఎప్పుడొస్తుందా.సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందా.. చూసేద్దామా అని అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై వేరే లెవెల్ లో బజ్ క్రియేట్ చేశాయి.ఇక సాంగ్స్ అయితే చెప్పనక్కర్లేదు. చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను అందుకుని దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర క్రేజ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్‌కు సోషల్ మీడియా తగలబెట్టేలా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. ముఖ్యంగా అమెరికాలో దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అక్కడి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోతున్నారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా షేర్ చేసుకుంది.
ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లోఇప్పటికే 110 మిలియన్ వ్యూస్ రాబట్టి.. టాప్ ట్రెండ్ అవుతోంది. ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తునే ఉంది దేవర. అదే సమయంలో దేవర సినిమా మరో 10 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి బయలుదేరారు. అక్కడ పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాల్గొంటారుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటికే 110 మిలియన్ వ్యూస్ రాబట్టి.. టాప్ ట్రెండ్ అవుతోంది. ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తునే ఉంది దేవర. అదే సమయంలో దేవర సినిమా మరో 10 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి బయలుదేరారు. అక్కడ పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా రేపు లేదా ఎల్లుండి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆయుధ పూజ సాంగ్ ను విడుదల చేయనున్నారు.అయితే.. చిత్ర యూనిట్ నుంచి దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈసారి దేవర నుంచి రాబోయే పాట ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు అభిమానులు. ఎందుకంటే..ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ ఒకటి షూట్ చేశామని.. ఆ పాటకు అంతా పోతారు అనేలా హైప్ ఎక్కించారు. అంతేకాదు.. ఓ 20-30 సెకన్ల బిట్ కూడా లీక్ అవగా.. ఆయుధ పూజ పై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇదే సాంగ్‌ను రిలీజ్ చేస్తారా? లేదంటే మరో కొత్త పాటను విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. దీంతో.. ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఏదేమైనా.. దేవర పై అంచనాలు మామూలుగా లేవనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: