శ్రీలీల కెరీర్ ప్రమాదంలో పడిందా..ఇండస్ట్రీకి గుడ్ బై?
టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల...ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్లను సైతం పక్కన నెట్టేసి శ్రీలీలతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపించారు.
స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది శ్రీలీల. ఎప్పటికప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువలో ఉంటుంది శ్రీలీల. అయితే ధమాకా సినిమా తర్వాత శ్రీలీలకు ఒక్క హిట్ కూడా పడలేదని చెప్పవచ్చు. వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికీ భారీ విజయాలను అందుకోలేకపోతుంది. అయితే ఈ మధ్య శ్రీలీల కాస్త సైలెంట్ గా ఉంటుందని .....అసలు శ్రీలీలకు ఏమైందని సోషల్ మీడియాలో తెగ చర్చలు చేస్తున్నారు అభిమానులు.
ఇక శ్రీలీల పెద్ద స్కెచ్ వేసిందని టాక్ వినిపిస్తోంది. తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ నార్త్ లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిందట. సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి సినిమా చేయనుందట. అక్టోబర్ నుంచి ఈ సినిమాకు తన కాల్ షీట్లు కేటాయించిందట. మిట్టి సినిమా కోసం ఇంతకుముందే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ లో ఫస్ట్ వెంచర్ బాగుండాలంటే కాస్త ప్రిపరేషన్ అవసరం కదా అని శ్రీలీల టాలీవుడ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిందట.
ఆ మధ్యకాలంలో విజయ్ నటించిన గోట్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో చేయమని శ్రీలీలకు ఆఫర్ ఇచ్చారట. ఇక రీసెంట్ గా విశ్వంభర సినిమా కోసం కూడా శ్రీలీలను అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ భామ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడడం లేదట. ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగులో రెండు, మూడు సినిమాలు రెడీగా ఉన్నాయట. ఇక శ్రీలీల మళ్లీ తెలుగులో ఎప్పుడు నటిస్తుందా అని తన అభిమానులు చూస్తున్నారు.