ఆ సినిమా కోసం లైఫ్ రిస్క్ చేసిన విజయ్.. కానీ ఫలితం మాత్రం అలా..?

Pulgam Srinivas
సినిమా హీరోలు సినిమాల కోసం ఎంతో కష్ట పడుతూ ఉంటారు. కొన్ని సన్నివేశాల కోసం వారు తమ లైఫ్ ను కూడా రిస్కు చేసి అందులో పాల్గొంటూ ఉంటారు. అలా పాల్గొన్న సమయాలలో కొంత మంది నటులకు గాయాలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా గాయాలతో ఎంతో కష్టపడినా కూడా సినిమా రిజల్ట్ మాత్రం వారిని నిరాశ పరచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సంఘటన టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కు కూడా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన ఈ నటుడు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ "డియర్ కామ్రేడ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లోని ఒక సన్నివేశం కోసం విజయ్ తన లైఫ్ ను రిస్క్ చేశాడట. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఒక ట్రైన్ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం బాగా రావడం కోసం విజయ్ ఎంతో కష్టపడ్డాడట.

ఇక ఈ సీన్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ట్రైన్ నుండి కింద పడ్డ విజయ్ కి అనేక గాయాలు అయ్యాయట. ఇక అతన్ని అక్కడ ఉన్న సిబ్బంది కాపాడినట్లు తెలుస్తోంది. అంత గాయాలు పాలైన చివరికి ఆ ట్రైన్ సన్నివేశాన్ని విజయ్ పూర్తి చేశాడట. ఇక ఎంతో కష్టపడి తన ప్రాణాలకు తెగించి మరి నటించిన ఈ సినిమా విజయ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిలింది. ఇకపోతే విజయ్ దేవరకొండ ఆఖరుగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: