అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది శ్రీలీల. ఈ నటి తన కెరీర్ ప్రారంభ రోజులలో మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్‌లతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకునే అరుదైన అవకాశాన్ని పొందింది. ఇది ఒక యువ కథానాయికకు గొప్ప విజయం. బాలీవుడ్లో కూడా శ్రీలీల అగ్రస్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హిందీ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం, శ్రీలీల ఓ భారీ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంది. ఈ విషయం కాసేపు పక్కన పెడితే సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి ఆమె చేతిలో చాలా సినిమాలు
ఉన్నాయి. కానీ ఏడాది తర్వాత ఈరోజు చూస్తే పరిస్థితి తారు మారయింది. ఆమె చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా అందులో పవన్ సినిమా పక్కన పెడితే ఇంకోటి చెప్పుకోదగ్గ ప్రాజెక్టు కాదు. ఆమె స్టార్ హీరోలతో చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో ఆమెను మళ్లీ మళ్లీ తీసుకునేందుకు నిర్మాతలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్, గ్రేస్ ని ఆధారంగా చేసుకుని ఆమెకు రెండు ఐటెం సాంగ్ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒక బడా బాలీవుడ్ సినిమాతో పాటు తమిళ్ లో
తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమాలో సైతం ఐటమ్ సాంగ్ చేయాల్సిందిగా ఆమెను నిర్మాతలు అప్రోచ్ అయ్యారట. అయితే తన కెరీయర్ని దృష్టిలో పెట్టుకుని తాను ఐటెం భామగా మారే ఉద్దేశమే లేదని ఆమె తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేసి హిట్టు కొట్టిన ఈమె ఆ సినిమా తర్వాత అయినా ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అయితే ఈ టైంలో ఆమె ఓ బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పింది. బాలీవుడ్ లో ఆఫర్ వస్తే ఎగిరి గంతేసే రోజులు ఎప్పుడో పోయాయి. సౌత్‌లో కాస్త క్రేజ్ ఉన్న ఏ హీరోయిన్ కైనా.. హిందీ నుంచి పిలుపు వస్తుంది..!!