అమ్మకానికి బాలీవుడ్ హీరోయిన్ అపార్ట్మెంట్.. ధర ఎంతో తెలిస్తే షాకే..?
తన పెళ్లి కూడా ఈ ఇంట్లోనే జరిగింది. తన తల్లిదండ్రుల ఇంటి నుండి వేరై తొలిసారిగా సొంత ఇంటిని కొనుగోలు చేసి సోనాక్షి ఎంతో సంబరపడింది. అయితే ఇప్పుడు ఆ ఇంటిని అమ్ముతున్నందుకు చాలామంది కారణాలు వెతుకుతున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్స్టాగ్రామ్ ఖాతా సోనాక్షి సిన్హా అపార్ట్‌మెంట్‌ను లిస్ట్ చేసింది. ఈ అపార్ట్మెంట్ బాంద్రా రిక్లమేషన్లోని ప్రతిష్టాత్మకమైన 81 ఆరియాట్ భవనంలో ఉంది. ఇక్కడి నుంచి సముద్రం చాలా బాగా కనిపిస్తుంది. ఈ 2BHK చాలా సౌకర్యాలతో నిండి ఉంది. ఇందులో ప్రత్యేకమైన ఇంటీరియర్స్, ఆధునిక సౌకర్యాలు, 3 పార్కింగ్ స్థలాలు ఉన్నాయి..
ఈ అపార్ట్మెంట్ ధరను రూ.25 కోట్లుగా సోనాక్షి నిర్దేశించినట్లు తెలుస్తోంది. సోనాక్షి 2023, సెప్టెంబర్‌లో బాంద్రా రీక్లమేషన్లోని 81 ఆరియేట్ బిల్డింగ్‌లోని 26వ అంతస్తులో ఉన్న ఈ అద్భుతమైన అపార్ట్‌మెంట్‌ను కొన్నది. ఈ ఇంటిని ఆమె తల్లి పూనమ్ కొన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ అపార్ట్మెంట్ విస్తీర్ణం 4,210 చదరపు అడుగులు, దీని విలువ 11 కోట్లు. ఇప్పుడు రెట్టింపు ధరకి ఆమె దానిని అమ్మకానికి పెట్టారు. ఈ ఇంటి నుంచి మహిమ్ బే, బాంద్రా-వర్లీ సీ లింక్ అద్భుతంగా కనిపిస్తుంది.
సోనాక్షి తమ ఇంటి ఫోటోలను ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా అనే మ్యాగజైన్లో ప్రచురించింది. ఆమెకు నాలుగు బెడ్రూమ్లు ఉన్న అపార్ట్మెంట్ ఉంది. దీన్ని ఆమె తనకు కావాల్సిన విధంగా మార్చుకుని ఒకటిన్నర బెడ్రూమ్లుగా మార్చారు. ఇందులో ఆమె చిత్రలేఖనం చేయడానికి స్టూడియో, యోగా చేయడానికి స్థలం, తన దుస్తులను అమర్చుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్, అన్ని దుస్తులు ఉంచడానికి వాక్-ఇన్ క్లోజెట్ లాంటివి ఉన్నాయి. ఆమె ఇంటి నుంచి అరేబియా సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె దుస్తుల గది, బాల్కనీ నుండి సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది.