అఫీషియల్ : గేమ్ చెంజర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దేశంలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి కియార అద్వానీ ఈ మూవీ లో చరణ్ కి జోడిగా కనిపించబోతోంది. అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రాలలో కనిపించనుండగా ... ఎస్ జె సూర్య ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యి చాలా కాలమే అవుతున్న ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీ పై అనేక వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు "గేమ్ చెంజర్" మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. కానీ అది ఎంత వరకు వాస్తవం అని జనాలు సందేహ పడ్డారు.

ఇకపోతే ఈ రోజు ఈ సినిమా దర్శకుడు అయినటువంటి శంకర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాణ సంస్థ శంకర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేస్తూ గేమ్ చెంజర్ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , కన్నడ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: