పవన్ నటిస్తున్న ఆ సినిమాను అంతమంది వద్దన్నారా..?

frame పవన్ నటిస్తున్న ఆ సినిమాను అంతమంది వద్దన్నారా..?

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీలా , పవన్ కి జోడిగా కనిపించనుండగా ... హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేశారు.

వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ విజయం అందుకున్న తేరి అనే మూవీ కి రీమేక్ గా రూపొందుతోంది. ఈ రీమిక్ సినిమాలో తలపతి విజయ్ హీరోగా నటించనుండగా ... సమంత ఈ మూవీలో  హీరోయిన్ గా నటించింది. అట్లీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇప్పటికే పోలీసోడు అనే పేరుతో తెలుగు లో కూడా విడుదల అయింది.

ఇకపోతే తాజాగా హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హీరోగా తేరి మూవీ కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని రూపొందించబోతున్నట్లు న్యూస్ బయటకు రాగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమా వద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. కేవలం ఒకే ఒక్క రోజు ఆ సినిమా వద్దు అంటూ దాదాపు 260000 మంది పోస్ట్ లు చేశారు. వాటన్నింటినీ తట్టుకొని నేను నిలబడ్డాను. ఇక ఆ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ విడుదల అయిన రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో సంతోష పడ్డారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని డిసైడ్ అయ్యారు. అలా పవన్ తో సినిమాను స్టార్ట్ చేసే ముందు అంత మంది వద్దన్నారు అనే విషయాన్ని హరీష్ శంకర్ తాజాగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: