ఫ్లాప్ టాక్ తో కూడా ఆరేర్ రికార్డును అందుకున్న పవన్ మూవీ..?

Pulgam Srinivas
కొంత మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలకు హిట్ , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అలా తెలుగు సినీ పరిశ్రమలో ఫ్లాప్ టాక్ తో కూడా భారీ కలెక్షన్లను వసూలు చేయగల స్టామినా కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన నటించిన సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చిన కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇక పవన్ నటించిన సినిమాకు గనక హిట్ టాక్ వచ్చినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది.


ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ "కాటమ రాయుడు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ విజయం అందుకున్న వీరమ్ అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇక వీరమ్ సినిమా తెలుగు లో కూడా విడుదల అయింది. అలా తెలుగు లో విడుదల అయిన వీరమ్ సినిమాని కాటమ రాయుడు అనే పేరుతో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక అప్పటికే తెలుగు లో విడుదల అయిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు లేవు.


అలా మామూలు అంచనాల నడ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా గొప్ప టాక్ ఏమీ రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ స్టామినా తో ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. అలా తెలుగులో విడుదల అయ్యి బిలో యావరేజ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమాతో కూడా పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏమిటి అనే విషయాన్ని ఈ మూవీ తో నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో పవన్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: