రివ్యూ: మిస్టర్ బచ్చన్.. రవితేజకు మళ్ళీ దేబ్బెనా..?

Divya
డైరెక్టర్ హరి శంకర్ సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఆ హీరో అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా సినిమాని రీమిక్స్ చేస్తున్నారంటే ఆ సినిమాని పూర్తిగా మార్చేసి హిట్టయ్యేలా చేస్తూ ఉంటారు డైరెక్టర్ హరీష్ శంకర్. ముఖ్యంగా తనకు ఇష్టమైన హీరోగా పేరుపొందిన రవితేజతో సినిమా చేస్తున్నారంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారు చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు తాజాగా వీరి కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.

ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ గా ఎన్నో రైడ్స్ చేసి వందల కోట్ల నల్లధనాన్ని సైతం వెలికితీస్తూ ఉంటారు. అలా అనుకోకుండా మిస్టర్ బచ్చన్ ఒక రైడ్ వల్ల విధుల నుంచి తీసేస్తారు. దీంతో తన సొంత ఊరికి వెళ్లి ఆర్కేష్టాను నడుపుతూ ఉంటారు.. అలాంటి సమయంలోనే జిక్కి (భాగ్యశ్రీ) చూసి ప్రేమలో పడతారు. అదే ఊరిలోనే ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) అరాచకాలు సైతం మితిమీరు ఉంటాయి. తన మీదికి వచ్చిన ప్రభుత్వ అధికారులను సైతం ఎదిరించి మళ్ళీ చంపేస్తూ ఉంటారు. ఇలాంటి ముత్యం జగ్గయ్య మీదికి మిస్టర్ బచ్చన్ వంటి వారిని రైట్స్కి పంపిస్తారు. ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటారు తన ఇంట్లో ఉండే నల్లధనాన్ని ఎలా పట్టుకుంటారనేది సినిమా కథ.
మిస్టర్ బచ్చన్ అనే సినిమా అజయ్ దేవగన్ నటించిన రెయుడు  సినిమాకి రీమెక్. ఈ చిత్రంలోని సారాంశాన్ని తీసుకొని తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి చేస్తే నచ్చుతుందో అలాంటి ఆడ్ చేశారు. పంచు డైలాగులతో నాలుగు ఫైట్లు ఐదు మంచి సాంగ్స్ చిత్రీకరించారు హరిశంకర్.. ఒకవేళ ఎవరైనా రెయిడ్ సినిమా చూడకుండా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమా పరవాలేదు అనిపిస్తుంది. ఒకవేళ రైడ్ సినిమా చూసి ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమా చూడకపోవడమే మంచిది అన్నట్లుగా కూడా పలువురు ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమాతో హరిశంకర్ నవ్వించాలని ప్రయత్నాలు చేసిన కాని చివరికి నవ్వుల పాలు అయినట్టుగా అనిపిస్తోందంటూ పలువురు అభిమానులు కూడా వాపోతున్నారు. హీరోయిన్ ని కూడా కేవలం గ్లామర్ కోసమే ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోందట. భాగ్యశ్రీ అందాలను మాత్రమే డైరెక్టర్ బాగానే చూపించారని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఇక మిక్కీ జేయరు బాదిన బాదుడికి తలపోటు వచ్చేలా ఉందంటూ పలువురు ప్రేక్షకులు వాపోతున్నారు. తనికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్ పాత్రలు బాగానే ఉన్నాయి. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ అట్రాక్షన్ గా బాగానే ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రవితేజ అభిమానులను కూడా నిరాశపరిచిందట.ఈ సినిమా రవితేజకు సక్సెస్  ఇస్తుందా లేదా అనేది కలెక్షన్ బట్టి చూడాలి.రవితేజ మంచి విజయాన్ని చివరిగా ధమాకా సినిమాతో అందుకున్నారు మళ్ళీ అంతటి సక్సెస్ ని అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: