టాప్ హీరోలకు షాక్ ఇస్తున్న గోట్ ప్రయత్నాలు ప్రయత్నాలు !
ఇలాంటి నేపధ్యంలో తమిళనాడు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ హీరోగా నటించిన ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం’ మూవీ సెప్టెంబర్ 5న విడుదలకాబోతోంది. ఈమూవీ మ్యానియాకు భయపడి వినాయకచవితికి తెలుగు సినిమాలు కూడ ఏమీ విడుదల కాకుండా భయపడుతున్నాయి అంటే విజయ్ మ్యానియా ఏవిధంగా ఉందో అర్థం అవుతుంది. ఈమూవీని తెలుగులో కూడ భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
పరిస్థితులు ఇలా ఉంటే ఈమూవీ నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సెప్టెంబర్ 5న తమిళనాడులోని ప్రతి థియేటర్లో రిలీజ్ రోజు కేవలం’ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మాత్రమే ప్రదర్శించేలా ఎగ్జిబిటర్లతో మాట్లాడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికోసం అప్పటికి రన్నింగ్ లో ఉన్న తమిళ తెలుగు హిందీ కన్నడ మలయాళం సినిమాలు ఏవి ఉన్నా వాటిని తొలగించి కేవలం ‘గోట్’ మాత్రమే ధియేటర్లలో ఉండేలా మాష్టర్ ప్లాన్ వేస్తున్నారు.
వాస్తవానికి ఇది కొంతవరకు జరగని పని అయినప్పటికీ విజయ్ కు ఉన్న మ్యానియా రీత్యా ఈప్రయత్నాలు చాల సీరియస్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈప్రయత్నాలు విజయవంతం అయితే దక్షిణాదిన ఆరోజు సినిమా ధియేటర్లలో ఒక్క ‘గోట్’ మినహా మరే సినిమా కనిపించదు. అదే వాస్తవ రూపం దాలిస్తే ఈమూవీకి మొదటిరోజు వచ్చే ఓపెనింగ్ కలక్షన్స్ 300 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అదే జరిగితే ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేయడమే కాకుండా ‘బాహుబలి 2’ ‘ఆర్ ఆర్ ఆర్’ రికార్డులను బ్రేక్ చేసినట్లు అవుతుంది..