భారీ వరదలు.. తెలుగు హీరో పెళ్లికి కష్టాలు తప్పేలా లేవు!

Suma Kallamadi
టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ వస్తున్నారు. డిఫరెంట్ స్టోరీ లైన్‌తో తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. రాజావారు రాణిగారు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ లాంటి సినిమాలు చేశారు. అన్ని సినిమాల్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్ చేసి క్రేజీ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో రెండు సినిమాలున్నాయి. దిల్ రూబా, కా వంటి టైటిల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి కిరణ్ సిద్ధమయ్యాడు.
ఇకపోతే రాజావారు రాణివారు మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రహస్య గోరఖ్ తోనే కిరణ్ అబ్బవరం ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నామని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు ఆ జంట ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసింది. ఈ మధ్యనే వారి ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాాజాగా వాళ్లిద్దరూ పెళ్లి డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసంలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆగస్టు 22వ తేదీన పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వినిపించింది. దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కేరళలో గ్రాండ్‌గా పెళ్లి చేేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారి ఆశ నెరవేరేట్టు కనిపించడం లేదు.
ప్రస్తుతం కేరళలో వరదలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ పరిస్థితులు అంతగా బాలేదు. వరదల వల్ల కేరళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనుకున్న తేదీన అనుకున్న ప్రదేశంలో కిరణ్, రహస్యల పెళ్లి జరిగేట్టు కనిపించడం లేదు. పెళ్లి జరిగే ప్రాంతం మారిందని, అది కూడా కర్ణాటకలోని కూర్గ్ లో జరగనుందని తెలుస్తోంది. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో తమ పెళ్లి గుర్తుండిపోవాలని కిరణ్ అనుకున్నారట. అందుకే అదే తేదీన పెళ్లి జరిగేలా ప్లాన్ చేసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: