నన్ను అప్పుడప్పుడు గుర్తుంచుకోండి మహేష్ కి హీరోయిన్ రిక్వెస్ట్..!

shami
సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే రోజు స్టార్స్ అంతా కూడా మహేష్ మీద ఉన్న అభిమానాన్ని బయట పెడుతూ సోషల్ మీడియాలో విసెష్ అందిస్తున్నారు. ఐతే ఒక హీరోయిన్ మాత్రం స్పెషల్ విష్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. మన మహేష్ సార్ అంటూ మొదలు పెట్టి నన్ను గుర్తుంచుకోండి అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఎందుకు అలా పెట్టింది చూస్తే. మహేష్ తో నటించిన ప్రతి హీరోయిన్ ఆయన సెన్సాఫ్ హ్యూమర్, ఆయన తో నటించడం బాగుంటుంది. ఇదే క్రమంలో మహేష్ తో నటించిన కీర్తి సురేష్ కూడా మహేష్ తో సర్కారు వారి పాట సినిమాలో జత కట్టింది.
ఆ సినిమాలో కళావతి పాత్రలో అమ్మడు తన గ్లామర్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. నేడు మహేష్ పుట్టినరోజు అవ్వడం వల్ల మన మహేస్ గారికి విషెష్ చెబుతూ నేను పనిచేసిన వరిలో అమేంజింగ్ పర్సనాలిటీ అంటూ మీ నుంచి రాబోయే అన్ని సినిమాలు బాగుండాలని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు ఈ స్పెషల్ రోజు మీకు ఎన్నో ప్రేమ పూర్వక శుభాకాంక్షలు అని పెట్టింది.
ఫైనల్ గా మీ కలవతిని అప్పుడప్పుడు గుర్తు పెట్టుకోండి అంటూ చివర్లో మహి అని పెట్టేసింది. మహేష్ తో నటించిన సర్కారు వారి పాట సినిమా పాత్ర తరహాలోనే సూపర్ స్టార్ కి చిలిపి మెసేజ్ చేసింది కీర్తి సురేష్. మహేష్ తో ఆమె నటించిన సర్కారు వారి పాట కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ఆ ఇద్దరి జోడీ మాత్రం అలరించింది. మహేష్ తో మళ్లోసారి నటించాలనే రిక్వెస్ట్ తోనే కీర్తి సురేష్ అలా గుర్తు పెట్టుకోండి అనే మెసేజ్ పెట్టిందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా ప్లానింగ్ లో ఉంది. నేడు ఈ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని అనుకోగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: