మహేష్ బాబు - ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక మాయాజాలం. ప్రతి సినిమాతో కొత్త రికార్డులు సృష్టిస్తూ, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నరు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ విజయం వెనుక ఎంతో కష్టాలు ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన సాధించిన విజయం, సంపద అన్నీ ఆయన కష్టానికి నిదర్శనం. అభిమానులుగా మనం ఆయన విజయానికి ఎంతో ఆనందించాలి. ఇకపోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మహేష్ బాబు ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవలైందే. మహేష్ బాబు ఆస్తుల విలువ దాదాపు రూ. 330 కోట్ల రూపాయలు. టాలీవుడ్‌లోని
అత్యంత ధనవంతులైన హీరోల్లో ఆయన ఒకరు. ఒక్కో సినిమాకు రూ.50-80 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు మహేష్. అలాగే మహేష్‌కు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. మహేష్ ప్రస్తుతం రాజమౌళి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీకు కు రూ. 125 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు మొదటి సినిమాలకి కేవలం 75 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. ఇప్పుడు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్నాడు. 'శ్రీమంతుడు', 'భరత అనే నేను', 'సర్కారు వారి పాట' లు ఇటీవల విడుదలై విజయం సాధించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' చిత్రానికి 78 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మహేష్ బాబుకు 30 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. మహేష్ 2005లో నటి, వ్యాపారవేత్త నమ్రతా శిరోద్కర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సితార, గౌతమ్ అనే పిల్లలు ఉన్నారు. ఇక మహేష్ బాబు దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు. ఇది ఇలా ఉంటే ఆగస్టు 9 అంటే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా మురారి సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా అభిమానులు అంతా సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.