దీపిక పదుకొనే రేంజ్ తనదని ప్రూవ్ చేసుకున్న సమంత..!

shami
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ లో మళ్లీ స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటుంది. ఖుషి సినిమా తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత బాలీవుడ్ లో సిటాడెల్ హనీ బనీ సీరీస్ లో నటించింది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ కోసం సమంత భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. అంతకుముందు ఈ డైరెక్టర్స్ తోనే సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 చేసింది. ఐతే మళ్లీ ఇప్పుడు సిటాడెల్ కోసం వారితో కలిసి పనిచేసింది.
ఐతే సమంత సిటాడెల్ కోసం 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఐతే ఆ విషయం తెలిసి బాలీవుడ్ మిగతా హీరోయిన్స్ అంతా కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈమధ్య వచ్చిన ప్రభాస్ కల్కి సినిమా కోసం దీపిక పదుకొనె కూడా 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అంటే కల్కిలో దీపిక ఎలానో సిటాడెల్ కి సమంత అలా అన్నమాట. దీపిక పదుకొనే రేంజ్ సమంత్ రెమ్యునరేషన్ తీసుకోవడం పట్ల సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
సమంత ప్రస్తుతం సిటాడెల్ తర్వాత తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఈ సినిమా విషయంలో కూడా సమంత ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా సౌత్ సినిమాల కన్నా బాలీవుడ్ మీదే పెట్టిందని అర్ధమవుతుంది. అందుకు తగినట్టుగానే అమ్మడికి అక్కడ ఆఫర్లు వస్తున్నాయి. అంతేకాదు సమంత రాజ్ అండ్ డీకే నెక్స్ట్ చేయబోతున్న సీరీస్ లకు కో ప్రొడ్యూసర్ గా కూడా చేస్తుందని తెలుస్తుంది. మరి సమంత దూకుడు చూస్తుంతే బాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా షాక్ ఇచ్చేలా ఉంది. మరో రెండు సినిమాలు బాలీవుడ్ లో చేస్తే మాత్రం సమంత అక్కడ తిరిగులేని క్రేజ్ తెచ్చుకునేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: