బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. అన్ స్టాపబుల్ -4 వచ్చేస్తోంది..!

frame బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. అన్ స్టాపబుల్ -4 వచ్చేస్తోంది..!

Divya
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలు మరొకపక్క హొస్టుగా చేస్తూ బాగానే పేరు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షెడ్యూల్ మధ్యలో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఇది ప్రసారం అవుతోంది.

అయితే ఈసారి గతంలో కంటే మంచి స్టఫ్ ఉండేలా ఆహా టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చిరంజీవి కూడా స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూడవ సీజన్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ మధ్యలో షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తూ ఉండటం ఆహా టీమ్. దసరాకి మొదటి ఎపిసోడ్ని సైతం  ఎదురుచేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సీజన్ డిసెంబర్ వరకు కొనసాగుతున్నట్లు సమాచారం.
అలా 109 వ సినిమా షూటింగ్ అని కూడా పూర్తి చేయబోతున్నారట బాలయ్య. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ని కూడా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ పైన నిర్మించబోతున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ  మొదటి సినిమా కోసం ఒక పవర్ఫుల్ స్టోరీని తీసుకున్నాడని ఈ సినిమాని తెరకెక్కించే పనిలో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ నే ఎంపిక చేయిస్తున్నట్లు బాలయ్య సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి అన్ స్టాపబుల్-4 తో బాలయ్య అభిమానులకు ఎలాంటి కిక్కెక్కిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: