పెద్ద వివాదంలో చిక్కుకున్న యాంకర్ సుమ.. అసలు ఏం జరిగిందంటే..!?

frame పెద్ద వివాదంలో చిక్కుకున్న యాంకర్ సుమ.. అసలు ఏం జరిగిందంటే..!?

Anilkumar
ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లలో టాప్ యాంకర్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు సుమ.  లెక్కలేలని టీవీ షోలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది యాంకర్ సుమ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ ఒక్క చిన్న ఈవెంట్ చేయాలి అన్న కూడా సుమ కోసం వెయిట్ చేయాల్సిందే. స్టార్ హీరో హీరోయిన్ల కి ఉన్నంత క్రేజ్ సంపాదించుకున్న సుమ డేట్ ల కోసం టాలీవుడ్ స్టార్స్ ఎందరో వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్న ఈవెంట్ నుండి స్టార్ హీరోల సినిమా ఫ్రీ

 రిలీజ్ ఈవెంట్ ల వరకు సుమనే యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. అలా ప్రస్తుతం క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉండే సుమ తాజాగా ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మరి ఆ విషయం లోకి వెళ్తే..రాజమండ్రిలో రాకీ అవెన్యూస్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసాలు బయటపడ్డాయి. మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేస్తామని 88 కోట్లు కట్టించుకొని బాధితులకు ఆ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది.అపార్టుమెంట్లు నిర్మాణం చేసి ఫ్లాట్ లు ఇస్తామని నమ్మించి మోసం చేసింది. రాకీ అవెన్యూస్‌ బోర్డు

 తిప్పేయడంతో వందలాది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో తమకు న్యాయం చేయాలనీ బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా .. ఈ విషయం బయటపడటంతో ఆ సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో బాధితులు కొందరు ఓ మీడియాతో మాట్లాడూతూ... 'రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్ వన్ బిల్డింగ్స్ చూశానని, ఫేజ్ 2 కూడా త్వరలో కడుతామని సుమతో ప్రచారం చేయించడం వల్లే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చానని తెలిపారు. తాను త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లు నాలుగు తీసుకొని ఒక్కొక్క ఫ్లాట్ కు 25 లక్షల ధర చెల్లించి మొత్తంగా కోటి రూపాయల వరకు వెచ్చించి రిజిస్ట్రేషన్ చేయించానని' తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: