అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. దిల్ రాజు లక్ష్యాలను సాధించలేకపోయారా?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. దిల్ రాజు ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ సర్కార్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అదే సమయంలో ఈ మీటింగ్ వల్ల ఇండస్ట్రీకి కలిగిన లాభాలు లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోతే తెలుగు సినిమాలు కలెక్షన్ల విషయంలో నైజాంలొ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం కష్టమవుతుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉండటంతో టికెట్ రేట్ల పెంపు అసాధ్యం అని తేలిపోయింది. సినిమా పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు అయితే రాలేదని సమాచారం అందుతోంది.
 
సమావేశంలో రేవంత్ రెడ్డి పైచేయి సాధించారని భోగట్టా. ఇండస్ట్రీకి ఒకటే టికెట్ రేట్లు ఉండటం వల్ల తీవ్రస్థాయిలో నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మరికొన్ని సంవత్సరాల పాటు ఈ నిబంధనల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ విషయంలో ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
 
సంక్రాంతి సినిమాలలో మూడు సినిమాలు దిల్ రాజు సినిమాలు కాగా ఈ సినిమాలు అన్ని భాషల్లో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దిల్ రాజు సినిమాల బడ్జెట్ దాదాపుగా 600 కోట్ల రూపాయలు అని సమాచారం. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు సక్సెస్ రేట్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: