అల్లు శిరీష్ పై సానుభూతి !
క్రితం సంవత్సరం అతడు నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో తిరిగి యూటర్న్ తీసుకుని కనీసం నిర్మాతగా అయినా తన సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారుతున్నాయి. ఈసినిమా విడుదలకు ముందురోజు క్రేజ్ తీసుకు వద్దామని కొన్ని స్పెషల్ షోలు వేసినప్పటికీ ఆ స్పెషల్ షోలను కూడ జనం పెద్దగా పట్టించుకోలేదు అన్నవార్తలు కూడ ఉన్నాయి.
దీనికితోడు టిక్కెట్ రేట్ తగ్గించినప్పటికీ జనం పట్టించుకోలేదు. గడిచిన వీకెండ్ లో హోటల్స్ పబ్ లు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా జనంతో కళకళలాడాయి కానీ టిక్కెట్ రేట్ తగ్గినా ‘బడ్డీ’ వైపు ఎవరు రాకపోవడంతో మరొక ఫ్లాప్ శిరీష్ కెరియర్ లో రికార్డ్ అయింది. సినిమాకు శిరీష్ తన నటన విషయంలో మెరుగులు దిద్దుకుంటున్నాడు కానీ తాను ఎంచుకునే సినీమా కథల విషయంలో తెలివిగా వ్యవహరించ లేకపోతూన్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈసినిమాను సరిగ్గా ప్రమోట్ చేయలేకపోవడంతో శిరీష్ నుండి కొత్త సినిమా వచ్చింది అన్న విషయం చాలమందిక తెలియలేదు.
అల్లు అరవింద్ అల్లు అర్జున్ బన్నీ వాసు లాంటి ప్రముఖులతో కూడిన అల్లు కాంపౌండ్ బ్యాక్ ఎండ్ లో ఉండి కూడ అల్లు శిరీష్ కు మంచి ప్రొడక్షన్ హౌస్ లు మంచి దర్శకుల సపోర్ట్ ఎందుకు దొరకడంలేదు అన్నది చాలామందికి సమాధానం లేని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడటంతో రెండు ఫ్లాప్ లు వచ్చాయి అంటే చాలు ఆ హీరోని పక్కకు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో శిరీష్ ఎంతవరకు నిలబడగలుగుతాడు అన్న సందేహం కొందరిలో ఉంది..