బాహుబలిలో అవంతికని రేప్ చేశారా.. రాజమౌళి షాకింగ్ రిప్లై..??
ఆ సన్నివేశాన్ని చాలా మంది ప్రేక్షకులు, సినిమా క్రిటిక్స్ తీవ్రంగా తప్పుబట్టారు. వారు దాన్ని "అవంతిక రేప్" అని పిలిచి, రాజమౌళి అవంతిక ఇష్టం లేకుండా ఆమెతో అలా చేయించాడని విమర్శించారు. కానీ, ఆ డాక్యుమెంటరీలో రాజమౌళి ఆ సన్నివేశాన్ని ఎందుకు చేశారో వివరించారు. ఆయన చెప్పినదేంటంటే, అవంతిక ఒక యోధురాలు అయినప్పటికీ, ఆమె యోధురాలై ఉండాలని కోరుకోదు. ఆమె ఒక అందమైన స్త్రీగా ఉండాలని కోరుకుంటుంది. శివుడుకు బాణం తగిలినప్పుడు కూడా అవంతిక అందం గురించే ఆలోచిస్తాడు, అంటే ఆమె స్త్రీత్వం కోసం ఎంతగా కోరుకుంటుందో ఈ సన్నివేశం ద్వారా చూపించడానికి ట్రై చేశానని రాజమౌళి చెప్పారు.
కొంతమంది ఆ సన్నివేశం వల్ల బాధపడ్డారని రాజమౌళి అంగీకరించారు. కానీ వారు తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. "శివగామి, దేవసేన లాంటి బలమైన పాత్రలు ఉన్నప్పటికీ, మహిళలను నేను చూపించే విధానాన్ని కొంతమంది విమర్శిస్తారు. వారు విమర్శిస్తారు కానీ దాని వెనుక ఉన్న కథను అర్థం చేసుకోరు" అని రాజమౌళి అన్నారు. ఆ సన్నివేశాన్ని హింస లేదా రేప్ గా అర్థం చేసుకోకూడదని రాజమౌళి అన్నారు.రాజమౌళి వ్యాఖ్యలు ఆ సన్నివేశం గురించి మళ్లీ చర్చకు దారితీశాయి. కొంతమంది రాజమౌళి కళా దృష్టిని సమర్థిస్తుంటే, మరికొందరు ఆ సన్నివేశం సరికాదని, అసభ్యంగా ఉందని అంటున్నారు. రాజమౌళి వ్యాఖ్యలు సినిమాల్లో లింగ సమానత్వం గురించి చర్చను రేకెత్తించాయి కానీ కళను కళగానే చూడాలి.