క్యారావన్ లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ భార్య కంటపడ్డ బాలీవుడ్ హీరో..?

frame క్యారావన్ లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ భార్య కంటపడ్డ బాలీవుడ్ హీరో..?

Pandrala Sravanthi
సెలబ్రిటీలు అన్నాక పెళ్లిళ్లు అయ్యాక కూడా సినిమాల్లో ఇంటిమేట్ సన్నివేషాల్లో నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు. ఇక టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు అయితే పెళ్లయ్యాక సాంప్రదాయమైన పాత్రల్లో చేస్తారు.కానీ బాలీవుడ్ హీరోయిన్స్ అయితే పెళ్ళై పిల్లలున్నా కూడా ఇంటిమేట్ సన్నివేశాలు చేయడానికి అస్సలు వెనకడుగు వేయరు. ఇక వారికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవో ఏమో కానీ సినిమాలు చాలా లైట్ గా తీసుకుంటారు.అందులో చేసే రొమాన్స్ ని మరింత లైట్ గా తీసుకుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలకు వెడ్డింగ్ ఫొటోస్ తీసే ఫోటోగ్రాఫర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ప్రస్తుతం బీటౌన్ లో వైరల్ గా మారింది. 

ఆ ఫోటోగ్రాఫర్ పేరు బయట పెట్టకుండానే  ఈ విషయం చెప్పడంతో చాలామంది ఆ ఫోటోగ్రాఫర్ మాట్లాడిన మాటలు ఏ హీరో గురించి అని ఆలోచనలో పడ్డారు. మరి ఇంతకీ ఆ ఫోటోగ్రాఫర్ చెప్పిన విషయం ఏంటంటే.. గతంలో బాలీవుడ్ కి సంబంధించిన ఇద్దరు స్టార్స్ పెళ్లి చేసుకున్నారు.అయితే వారిద్దరి పెళ్లైన రెండు నెలలకే ఆ బాలీవుడ్ హీరో క్యారావ్యాన్లో మరో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ తన భార్య అంటే ఆ హీరోయిన్ కి అడ్డంగా దొరికిపోయాడు అంటూ ఆ హీరో పేరు చెప్పకుండానే సంచలన విషయాన్ని బయట పెట్టారు బాలీవుడ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్.. ఇక ఆ ఫోటోగ్రాఫర్ చెప్పిన విషయం నెట్టింట్లో వైరలవ్వడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న వారు రణ్బీర్ కపూర్, అలియా భట్, కియరా అద్వాని,సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వంటి కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు.

 కానీ ఈ సెలబ్రిటీల అందరిలోకెల్లా రణ్బీర్ కపూర్,అలియా భట్ కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్ర ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణబీర్,సిద్ధార్థ్ మల్హోత్రా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు క్యారావ్యాన్లో మరో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ భార్యకి అడ్డంగా దొరికిపోయారు అంటూ ఆ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ చెప్పిన వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారడంతో ఇంతకీ పెళ్లయిన రెండు నెలలకే క్యారావ్యాన్లో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన ఆ హీరో ఎవరబ్బా అంటూ నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: