రాజా సాబ్ లో డిఫరెంట్ ప్రభాస్..!

shami
రెబల్ స్టార్ ప్రభాస్ ఈమధ్యనే కల్కి 2898 ఏడి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమాకు పెట్టిన 500 కోట్ల పైన బడ్జెట్ అంతా తెర మీద కనిపించేలా విజువల్ వండర్ గా సినిమా తెరకెక్కించారు. సినిమా అంచనాలకు తగినట్టుగానే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమాతో వస్తున్నాడు.
ఈ సినిమా నుంచి నేడు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రభాస్ ఈమధ్య కాలం లో అన్ని సీరియస్ సినిమాలే చేస్తూ వచ్చాడు. అందుకే రాజా సాబ్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో రాబోతున్నాడని తెలుస్తుంది. కల్కి సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా భైరవ కామెడీ బాగుంటుంది. ఐతే అంత పెద్ద సెటప్ లో ప్రభాస్ కామెడీ హైలెట్ అవ్వలేదు. ఐతే రాజా సాబ్ లో మాత్రం ప్రభాస్ కామెడీ హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.
రాజా సాబ్ ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఇది ప్రస్తుతం ప్రభాస్ ఇమేజ్ కు భిన్నంగా వస్తుందని చూపించారు. వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తే మాత్రం సినిమా రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని చెప్పొచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజా సాబ్ సినిమాలో మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అవుతుందని అంటున్నారు. మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా వస్తూనే డార్లింగ్ టైమింగ్ తో సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మరి రాజా సాబ్ సృష్టించే సంచలనాలు ఎలా ఉంటాయో సినిమా వస్తేనే చెప్పగలం. సినిమాను ముందు 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అనుకోగా అది కాస్త మిస్ అయ్యి నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ లాక్ చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: