సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ సంపాదన ఎలాంటి ఉద్యోగికీ ఉండదు!
అతనే సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గుర్మీత్ సింగ్ జాలీ. గత 3 దశాబ్దాలుగా సల్లూ భాయ్‌కు బాడీగార్డ్‌గా వ్యవహరిస్తున్న ఇతన్ని మన సల్లూ భాయ్ ముద్దుగా షేరా అని పిలుచుకుంటారు. గుర్మీత్ సింగ్ జాలీ అలియాస్ షేరా ముంబయి నగరంలో 1969లో పుట్టాడు. అతనికి బాడీ బిల్డింగ్‌లో ఇంటరెస్ట్ ఉండడంతో బాగా శిక్షణ పొంది జూనియర్ బాడీ బిల్డింగ్‌లో ఛాంపియన్ టైటిల్ గెలిచారు. 1987లో మిస్టర్ ముంబయి టైటిల్ కూడా సాధించారు. ఆ తర్వాత 90లలో బాడీ గార్డుగా పని చేయడం మొదలు పెట్టిన గుర్మీత్ ఓ ప్రైవేట్ కంపెనీ కోసం పని చేయగా సల్మాన్ ఖాన్‌కు పరిచమయ్యారు. అతని వ్యక్తిత్వం నచ్చడంతో గుర్మీత్‌ను పర్సనల్ బాడీగార్డుగా నియమించుకున్నారు.
ఇక అప్పటినుండి సల్మాన్ అతడిని వెంటేసుకునే తిరుగుతున్నారు. ఆయన పక్కన లేనిదే మన సల్లూ భాయ్ బయట కాలు పెట్టనే పెట్టడు. అలా 30 ఏళ్లుగా తనకు పర్సనల్ బాడీగార్డ్‌గా ఉంటున్న షేరాపై సల్మాన్‌కు నమ్మకం, చనువు కాస్త ఎక్కువే. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీరిద్దరి ఫొటోలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొన్ని ఫొటొల్లో షేరా సల్మాన్ ఖాన్ భూజాలపై చేయి వేసి నిలబడటం మనం గమనించవచ్చు కూడా. ఇంతకీ షేరా జీతం ఎంతో అని ఆలోచిస్తున్నారు కదా? అక్కడికే వస్తున్నాం.. ఆయన జీతం ఏడాదికి అక్షరాలా 5 కోట్ల రూపాయలు. అంటే నెల తిరిగేసరికి మనోడి అకౌంట్లో సుమారుగా 40 లక్షల రూపాయలు జమ అవుతాయన్న మాట. మరి చెప్పండి.. మీకు అంత జీతం వస్తుందా?