అయ్యో వెంకటేష్ విలన్ ఇలా అయిపోయాడు ఏంటి?
అయితే ఈ సినిమాలోని విలన్ పాత్రను కూడా ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోలేరు. పాండా పాత్రలో మెప్పించిన ప్రతి నాయకుడు సలీం గురించి కూడా అందరికీ తెలిసిందే. తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టాడు సలీం. అయితే ఆ సినిమా తర్వాత ఆయన మన తెలుగు సినిమాలలో కనిపించడం చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. మరల ఇన్నాళ్ళకి ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. దాంతో ఆయన ఫోటోలు చూసిన జనాలు సలీం ఎంత మారిపోయాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జై మూవీతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన సలీమ్ బేగ్.. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్.. డైరెక్టర్ గౌతమ్ మీనన్ కు పరిచయం చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే.
యాక్టర్ సలీం గురించి తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు గాని, తమిళ తంబీలకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ఓ డజనుకు పైగా ఆయన సినిమాలు చేయడం జరిగింది. అంతే కాకుండా... బాలీవుడ్ లో కూడా ఆయన తనదైన మార్క్ ప్రదర్శించుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్లు విరామం తీసుకున్న సలీం త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి మన పాండాకి మనమందరం ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా?