యాక్సిడెంట్ కి గురైన ప్రేమలు నటుడు.. రక్తపు మడుగులో ఉన్న ఫొటోస్ వైరల్..!

lakhmi saranya
ప్రేమలు సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న నటుడు సంగీత్ ప్రతాప్, అర్జుకన్ ఆశోకన్ ఉన్న కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి ఓ సినిమా సీన్స్ కాచ్చిలో చేస్తుండగా..శనివారం నాడు కారు ప్రమాదం జరిగింది. 2 బైకులను ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. కారు తీవ్రంగా ధ్వంసం అవటంతో పాటుగా..బ్రేక్ పై ప్రయాణిస్తున్న వారితో పాటుగా ప్రేమలు నటుడికి, అర్జున్ కు గాయాలు అయినట్లు సమాచారం. ఇదంతా సినిమా షూటింగ్ లో భాగంగా హై స్పీడ్ తో ఛేజింగ్ సీన్స్ చేస్తుండగా..ఎంజి రోడ్ లో కారు ప్రమాదానికి గురైంది.


రక్త మడుగులో ఉన్న యాక్టర్స్ ను బైక్ రైడర్ తో సహా ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు మేకర్స్. ప్రమాదం జరగటంతో సినిమా షూటింగ్ బ్రేక్ పడింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా అర్జున్ బోస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సంగీత్, అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. దీనిని ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఆషిక్ నిర్మిస్తుండగా..మహిమ నంబియార్, కళాభవన్ షాజోన్, బీసు నటిస్తున్నారు.


ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర్వేగంగా జరుగుతుండగా..ఈ సమయంలో యాక్సిడెంట్ కావటంతో అంతా టెన్షన్ పడుతున్నారు . ప్రస్తుతం ఇద్దరూ యాక్టర్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో..ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కుగారు పడుతున్నారు. వారు త్వరగా కోలుకుని మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు . ఎప్పుడు గాయాలు తగ్గి ఎప్పుడు ఇండస్ట్రీలోకి మళ్ళీ అడుగు పెడతారు అంటూ ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. త్వరగా వచ్చి ఈ సినిమాని పూర్తి చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: