డిసెంబర్ మిస్సైతే సమ్మర్ కి షిఫ్ట్..!

shami
అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న భారీ సినిమా తండేల్. నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ లో చైతు సరసన సాయి పల్లవి నటించడం సినిమాపై మరింత బజ్ పెంచింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇదిలాఉంటే ఈ సినిమా రిలీజ్ ని డిసెంబర్ లో లాక్ చేశారు. క్రిస్మస్ బరిలో సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి రావడం కష్టమే అని తెలుస్తుంది. క్రిస్ మస్ రేసులో చరణ్ సినిమా రిలీజ్ అవుతుండటం వల్ల పోటీగా వచ్చి రిస్క్ ఫేస్ చేయడం ఎందుకని తండేల్ టీం భావిస్తుంది. డిసెంబర్ కాకపోతే మళ్లీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కే ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు. ఈలోగా మరే డేట్ కి వేసినా సినిమాకు అంత బజ్ ఉండదు.
కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్న సినిమా తండేల్. ఈ సినిమా చైతు కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. అందుకే సినిమా రిలీజ్ విషయంలో అసలు తొందర పడకూడదని అనుకుంటున్నరట. నాగ చైతన్య కూడా సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది. ఎలాగు హిట్ కాంబినేషన్ కాబట్టి తండేల్ కి తిరుగు ఉండదని అంటున్నారు. నాగ చైతన్య కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా పండుగ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా చందు మొండేటి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి సినిమా ఇంత హంగామా చేస్తుండగా రిలీజ్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: