ఇక్కడ చిరు.. అక్కడ బాలయ్య.. కుర్ర హీరోలకు దీటుగా కష్టపడుతున్న సీనియర్స్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు. ఇకపోతే వీరిద్దరూ వయస్సు పెరిగిన హిట్లు సాధిస్తూ అద్భుతమైన జోష్ ఉన్న హీరోలుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు . చిరంజీవి పోయిన సంవత్సరం వాల్టేరు వీరయ్య , భోళా శంకర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించగా , వాల్తేరు వీరయ్య మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకో గా , భోళా శంకర్ మూవీ తో అపజయాన్ని అందుకున్నాడు . ఇక బాలకృష్ణ పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అందులో మొదటగా వీర సింహా రెడ్డి ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకారణను శర వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం రాజస్థాన్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చేస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: