బిగ్ బాస్ కోసం నాగార్జున బ్లాస్టింగ్ రెమ్యునరేషన్..!

shami
బిగ్ బాస్ తెలుగుకి వన్ అండ్ ఓన్లీ హోస్ట్ గా కింగ్ నాగార్జున కొనసాగుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ చేశాడు. ఆ తర్వాత నాని సెకండ్ సీజన్ హోస్ట్ చేశాడు. థర్డ్ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. ఆల్రెడీ అంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ చేసిన నాగార్జున ఆ అనుభవం ఎక్స్ పీరియన్స్ తో బిగ్ బాస్ ని అదరగొట్టేస్తున్నారు.
ఐతే సీజన్ మొదలయ్యే ముందు ఈసారి హోస్ట్ మారుతున్నాడంటూ హడావిడి చేయడం మళ్లీ చివరకు నాగార్జుననే రావడం జరుగుతుంది. ఐతే ఈసారి హోస్ట్ విషయంలో మాత్రం డౌట్ లేకుండా చెప్పారు. నాగార్జునే కొన్నాళ్ల పాటు బిగ్ బాస్ హోస్ట్ చేస్తారని ముందే డిక్లేర్ చేశారు. ఐతే సీజన్ 7 కన్నా సీజన్ 8 కోసం నాగార్జున రెమ్యునరేషన్ భారీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
సీజన్ 7 కి నాగార్జున 20 కోట్లు రెమ్యునరేషన్ గా అనుకోగా సీజన్ 8కి మత్రం మరో 10 కోట్లు ఎక్స్ ట్రా అంటే 30 కోట్ల దాకా డిమాండ్ చేశాడట. ముందు చెప్పినట్టుగా బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా చేసే అవకాశం ఉన్నది కేవలం నాగార్జుననే అని రెమ్యునరేషన్ ఆయన అడిగినంత ఇచ్చేస్తున్నారట. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా ఇప్పటికే ఐదు సీజన్లు హోస్ట్ చేశారు. మధ్యలో ఒక ఓటీటీ షోకి చేశారు. సో సీజన్ సీజన్ కి నాగార్జున కూడా హోస్ట్ గా తన టాలెంట్ తో మెప్పిస్తున్నారు. సీనియర్ స్టార్ గా ఓ పక్క రెస్పెక్ట్ తో పాటు సీజన్ హైప్ కు నాగార్జున కూడా ఒక కారణం అవుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: