రాజా సాబ్ బ్యూటీ ఆ విషయంలో అస్సలు తగ్గదంతే..!

shami
రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్న ముద్దుగుమ్మ మళయాళ భామ మాళవిక మోహనన్ ఆ సినిమాతోనే తెలుగు ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటివరకు తమిళ, మలయాళ భాషల సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన మాళవిక రాజా సాబ్ తో స్ట్రైట్ గా వస్తుంది. సినిమా రిలీజ్ కు ముందు ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెబుతున్న అమ్మడు రాజా సాబ్ తర్వాత తన రేంజ్ ఏంటన్నది తెలుస్తుందని అంటుంది.
ఇక సినిమాల కన్నా ఎక్కువ ఫోటో షూట్స్ తోనూ అమ్మడు ఫాలోవర్స్ కి మజా అందిస్తుంది. ముఖ్యంగా అమ్మడు శారీ లుక్ తో మాళవిక చేస్తున్న గ్లామర్ షో అదిరిపోతుంది. లేటెస్ట్ గా మాళవిక మోహనన్ లైట్ కలర్ శారీలో గ్లామర్ షో చేస్తూ అదరగొట్టేస్తుంది. ఇలా ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా ఉంది అమ్మడు. ఎక్కడ చూపించాలో ఎక్కడ కవర్ చేయాలో బాగా తెలిసిన అమ్మడు గ్లామర్ షోకి కొత్త అర్ధం చెబుతుంది.
మాళవిక మోహనన్ తెలుగు ఎంట్రీ కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఐతే ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడు ఆ సినిమా తర్వాత ఇక్కడ వరుస ఛాన్సులు అందుకునే ఛాన్స్ ఉంది. చేస్తే సినిమాలు లేదా ఫోటో షూట్స్ ఇలా తన టైం ని ఎక్కడ వేస్ట్ చేయట్లేదు అమ్మడు. పర్ఫెక్ట్ స్టార్ మెటీరియల్ గా అనిపిస్తున్న మాళవిక ఇప్పటికే తమిళ సినిమాలతో మెప్పిస్తున్నా తెలుగులో ఇంకా ఖాతా తెరవలేదు. ప్రభాస్ రాజా సాబ్ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. థ్రిల్లర్ జోనర్ లో ప్రభాస్ మార్క్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వస్తుందట. మరి మాళవిక మొదటి తెలుగు సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అమ్మడు మాత్రం ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: