ఎన్టీఆర్ తో ఆ పని ఎప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తున్నా.. జాన్వికపూర్..!?

Anilkumar
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ డ్రామా దేవర. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుండడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నిలకున్నాయ్. దేవర సినిమా షూటింగ్ జరుగుతోంది. కథానాయికగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. జాన్వీ కపూర్ తెలుగులో నటిస్తున్న తొలిచిత్రం.ఇక ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫియర్ సాంగ్ ప్రేక్షకుల్లో ఓ అంచనాను క్రియేట్ చేస్తే జాన్వీ కపూర్ కామెంట్స్ మరింత బలాన్ని చేకూర్చాయి. విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ

 మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. ఎన్టీఆర్‌పై ఆసక్తికర కామెంట్‌ చేశారు.   అమితాబ్‌ బచ్చన్‌, హృతిక్‌ రోషన్‌, విక్కీ కౌశల్‌ వీరిలో ఎవరితో డ్యాన్స్‌ చేయాలని ఉందని అడగ్గా.. తనకు ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేయాలనుందని వెల్లడించారు. 'ప్రస్తుతం 'దేవర'లో నటిస్తున్నాను. ఎన్టీఆర్‌తో కలిసి ఓ పాట షూటింగ్‌ పూర్తయింది. తర్వాత పాటను ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని చెప్పారు. 'దేవర' సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా.

 పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ డ్రామా దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. కీలక పాత్రలో శ్రీకాంత్‌లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కామెంట్స్ తో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ డ్రామా దేవర  పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: