
ఎన్టీఆర్ తో అలా చేయడం.. ఎంతో ఇష్టం : జాన్వి
అయితే కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేకుతున్న దేవర సినిమాలో నటిస్తూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. ఏకంగా ఈ సినిమాలో విభిన్నమైన లుక్ తో తారక్ కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. అయితే ఈ మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తన తల్లి శ్రీదేవి లాగానే టాలీవుడ్ లో కూడా అగ్రతారగా ఎదగాలని జాన్వికపూర్ ఆశలు పెట్టుకుంది.
అయితే ఇటీవల జాన్వి కపూర్ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటూ ఇక తన కోస్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరు ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పింది. వికీ కౌశల్, హృతిక్ రోషన్ లో ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారు అని యాంకర్ అడిగితే.. వాళ్ళిద్దరూ కాదు జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేసేందుకు ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది జాన్వికపూర్. ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్ తో కలిసి ఒక సాంగ్ చేశా. ఇక ఇప్పుడు మరో సాంగ్ చేసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్న అంటూ జాన్వి సమాధానం ఇచ్చింది.