అఖండ 2 అదే జరిగితే మాత్రం పెద్ద దెబ్బే..!
స్కంద సినిమా టైం లోనే థమన్ తో బోయపాటి శ్రీను రుసరుసలాడాడని టాక్. ఇప్పుడు అదే కోపంతో అఖండ 2 నుంచి కూడా ఆయన్ను తప్పించారని తెలుస్తుంది. థమన్ బ్యాక్ గ్రౌడ్ స్కో వల్లే అఖండ కు భారీ హైప్ వచ్చింది. మర్ సీక్వెల్ లో అతను కాకుండా మరెవరు చేస్తాడు అంటే థమన్ బదులుగా యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో చేయిస్తారని తెలుస్తుంది.
అఖండ 2 లాంటి సినిమాలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అందుకే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. థమన్ అయితేనే ఈ సినిమాకు న్యాయం చేస్తాడని అనుకుంటే ఇప్పుడు ఆయన ప్లేస్ లో మరొకరు మ్యూజిక్ అందించబోతున్నారు. బోయపాటి బాలయ్య సినిమా అంటే అది పక్కా హిట్ అన్నట్టే లెక్క. మరి ఆలకృష్ణ అఖండ 2 కి ఈ మ్యూజిక్ డైరెక్టర్ మార్పు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2025 సంక్రాంతికి వస్తుందని టాక్. అఖండ 2 ని డిసెంబర్ లో మొదలు పెట్టి కుదిరితే 2025 సమ్మర్ లేదా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.