నెట్ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి మూవీ.. అదిరిపోయే ట్విస్టులకు ఫిదా అవుతున్న నెటిజన్స్..!
తరువాత జులై 12 న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. మూడు రోజుల్లోనే టాప్ డ్రేండింగ్ మూవీస్ లో తొలి స్థానానికి దూసుకెళ్తుంది. ఇప్పటివరకు మూడు వారాలుగా ఆ స్థానంలో ఉన్న హిందీ మూవీ మహారాజ్ ను వెనక్కి నెట్టింది. జులై 15 నుంచి ఈ సినిమా టాప్ లోనే ఉంటూ వస్తుంది. రెండో వారంలోనూ మహారాజునే నెట్లి ఫ్లిక్స్ ఇండియాలో టాప్ డ్రెండింగ్ మూవీ కావటం విశేషం. ఈ సినిమాలోని ట్విస్టులు, విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాక్స్ ఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల సాధించిన ఈ సినిమాకు ఓటీడీలో అంతకు మించిన ఆదరణే లభిస్తోంది. మహారాజ్ మూవీ ఓ క్రైమ్ థ్రిల్లర్.
ఈ సినిమాలో ఓ సాధారణ బార్బర్ గా నటించాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. తన ఇంట్లో ఓ దొంగతనం జరిగిందని, తమ జీవితంల్లో ఎంతో ముఖ్యమైన లక్ష్మీ ని ఎవరో ఎత్తుకెళ్లారని మహారాజా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అసలు ఆల్ లక్ష్మీ ఎవరూ అన్నది ఓ ట్విస్ట్ కాగా..దాని చుట్టూ తిరిగే కథ, అందులో భాగంగా వచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాంక్ అవుతుంది. ఓ కైమ్ థ్రిల్లర మూవీని ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులతో తీసే ఎలా ఉంటుందో ఈ మహారాజ్ మూవీ నిరూపిస్తోంది. మొదటి సీన్ నుంచి క్రైమ్యక్స్ వరకు ప్రతి సీన్లోనూ సినిమా ఎంతో ఉత్కంఠ రేపుతోంది.