చరణ్ వస్తున్నాడు అంటే.. వాళ్లు ఆగిపోతారా..?
ఇండియన్ 2 ఫ్లాప్ తో శంకర్ మీద ఒక పక్క డౌట్ ఉన్నా.. శంకర్ కూడా ఒకటి అట్టర్లీ పోతే ఆ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అలా చూస్తే గేమ్ చేంజర్ కి అది కలిసి వచ్చేలా ఉంది. గేమ్ చేంజర్ సినిమా నుంచి ఒక సాంగ్ మొదట్లో ఒక గ్లింప్స్ మాత్రమే వదిలారు. అసలు సినిమా చాలా కథ ఉంటుందని టాక్.
ఐతే డిసెంబర్ లో క్రిస్మస్ బరిలో గేమ్ చేంజర్ వస్తున్నాడు అంటే చరణ్ కి పోటీగా మరో సినిమా ఉండే ఛాన్స్ లేదు. ఐతే ఇప్పటికే నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు క్రిస్మస్ రిలీజ్ లాక్ చేశారు. గేమ్ చేంజర్ వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ డేట్ ని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. గేమ్ చేంజర్ అవుట్ పుట్ అద్భుతంగా వస్తుందని సినిమా పక్కా హిట్ టార్గెట్ రీచ్ అవుతుందని చెబుతున్నారు. నిర్మాత దిల్ రాజు కాబట్టి కచ్చితంగా గేమ్ చేంజర్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తారని అర్ధమవుతుంది. గేమ్ చేంజర్ సినిమా పూర్తి కాగానే చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు.