గేమ్ చెంజర్ రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. ఆ మూవీలకి టెన్షన్ స్టార్ట్..?
మరో 10 , 15 రోజుల షూటింగ్ తో ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించలేదు. దానితో ఈ సినిమా విడుదల తేదీ పై అనేక వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు ధనుష్ హీరోగా మరియు దర్శకత్వంలో రూపొందిన రాయన్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
అందులో భాగంగా ఆ ఈవెంట్ కు విచ్చేసిన ప్రేక్షకులు గేమ్ చేంజర్ విడుదల అప్డేట్ ఇవ్వండి అని గట్టిగా అరవడంతో ఆయన గేమ్ చేంజర్ విడుదల గురించేనా అడుగుతున్నారు. అయితే క్రిస్మస్ పండక్కి కలుద్దాం అని చెప్పాడు. దీనితో ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి మూవీ బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా కొన్ని సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. వారికి ఈ అప్డేట్ టెన్షన్ పెట్టే అవకాశం చాలా వరకు ఉంది.