బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ అందరికీ సుపరిచితుడే..ఈయన యానిమల్ మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. యానిమల్ మూవీ తో 900 కోట్లకు పైగా వసూళ్లను కలెక్ట్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన యానిమల్ మూవీ కి త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుంది. అయితే రణబీర్ కపూర్ హీరోగా కంటే అమ్మాయిల విషయంలో బాలీవుడ్ లో ఎక్కువ వైరల్ అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా రణబీర్ కపూర్ ఇప్పటికే చాలామంది బాలీవుడ్ భామలు అయినటువంటి కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్,ప్రియాంక చోప్రా, అవంతిక మాలిక్, నర్గీస్ ఫక్రీ వంటి ఎంతోమంది నటీమణులతో ప్రేమాయణం నడిపించి చాలా సంవత్సరాలు డేటింగ్ చేశారు.
కానీ చివరికి యంగ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిర్మాత మహేష్ భట్ కూతురు అలియా భట్ తో ప్రేమలో పడి చివరికి ఆమెని పెళ్లాడారు.వీరిద్దరికీ రాహ అనే పాప కూడా ఉంది. అయితే రణబీర్ కపూర్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఉన్నారు. అయితే అలాంటి ఈయన రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ..తన క్యారెక్టర్ పై చాలా మంది తగిలించిన ట్యాగ్స్ గురించి మొదటిసారి స్పందించారు రణబీర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నన్ను చీటర్, కాసనోవా అనే ముద్ర వేశారు. అయితే నేను గతంలో ఇద్దరు హీరోయిన్లతో డేటింగ్ చేశాను. ఆ డేటింగ్ కారణంగా నా మీద అదే ముద్ర పడింది.
అప్పటినుండి చీటర్ గానే నన్ను చూస్తున్నారు.అంతేకాదు నా లైఫ్ లో ఉన్న చాలా సంవత్సరాలు మోసగాడిగానే గడిచాయి. ఇక నిజం మాట్లాడాలి అంటే ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నన్ను మోసగాడిగానే చూస్తున్నారు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అలాగే తన కూతురి గురించి మాట్లాడుతూ.. రాహ మా జీవితంలో వెలుగులు నింపింది. నాకు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నా కూతురే.. అలాగే మా నాన్న అకాల మరణం మా ఫ్యామిలీని ఎంతగానో కుంగదీసింది.చిన్నప్పటినుండి మా నాన్న అంటే నాకు చాలా భయం. ఆయన కళ్లల్లోకి కళ్లుపెట్టి చూడాలంటేనే వణికి పోయేవాడిని అంటూ రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు