"గేమ్ చేంజర్" కోస అలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిన దిల్ రాజు.. అది ఓకే అయితే బ్లాక్ బాస్టర్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయింది. ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు , ఇంకో పది , పదిహేను రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు శంకర్ కొన్ని రోజుల తెలియజేశాడు. ఇకపోతే శంకర్ తాజాగా భారతీయుడు 2 సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసింది.

కొన్ని రోజుల క్రితం విడుదల ఆయన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశాలు భారీగానే కనబడుతున్నాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 ఫ్లాప్ కావడంతో గేమ్ చేంజర్ కు కూడా పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుందా ... లేదా అని అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో వినబడుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. అందులో ఈ సినిమా కోసం అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేస్తూ రావాలి అని , అందులో ఎక్కడ ఏదైనా మిస్టేక్ వచ్చినట్లు అయితే వెంటనే రీ షూట్ పెట్టి అయిన సరే దానిని క్లియర్ చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఎంత ఖర్చైనా పర్లేదు ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేయాలి అనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా దిల్ రాజు ఇంత కసితో ఉండడంతో ఈ మూవీ కచ్చితంగా మంచి విజయం అందుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

dr

సంబంధిత వార్తలు: