వామ్మో: అక్కడ ఉన్న టాటో అర్థం చెప్పేసిన హీరోయిన్ అనన్య నాగళ్ల..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటిసారి మల్లేశం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. టాలీవుడ్ లో పలు చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలో పలు చిత్రాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంది. ఇటీవలే హీరోయిన్గా కూడా అవకాశాలను అందుకుంది. తంత్ర అనే ఒక హర్రర్ సినిమాలో కూడా నటించింది.

అయితే  అనన్య నాగళ్ల తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యి ఇందులో వకీల్ సాబ్ చిత్రంలోని తన క్యారెక్టర్ గురించి అడగడంతో చాలా వినయంగానే సమాధానాన్ని తెలియజేసింది. అలాగే తన చేతిపై ఉన్న టాటూ కు అర్థం ఏంటి అని ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా అనన్య ఇలా మాట్లాడుతూ.."ఐ బిలీవ్ ఇన్ సెల్ అనగా నన్ను నేను నమ్ముతాను మన ముఖం పైన ఉన్న చిరునవ్వును ఎప్పటికీ మర్చిపోకూడదని మీనింగ్ అంటూ తెలిపింది". తన ఫోకస్ మొత్తం ఒకదానిపైనే పెడుతూ ఉంటాను.. దీంతో అందరిని మర్చిపోతూ ఉంటానని.. అందుకే చేతి పైన ఇలా టాటూ గుర్తుకొచ్చినప్పుడల్లా అందరితో ఆనందంగా ఉండడానికి ఇలా వేసుకున్నానంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

గతంలో  ప్రస్తుతం తనకు  ఎవరూ కూడా ప్రపోజ్ చేయలేదని ఎవరైనా సరే సినీ పరిశ్రమలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ కమిట్ అయి ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు.. కానీ తను అలా లేనని తెలిపింది.. అలాగే కాస్టింగ్ కౌచ్ విషయంలో కూడా ఇంతవరకు ఎప్పుడు ఎదుర్కోలేదని అనన్య తెలియజేసింది.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను మాత్రం షేర్ చేస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎట్టకేలకు తన టాటో సీక్రెట్ విషయాన్ని చెప్పేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: